కె వి కె గడ్డిపల్లి క్షేత్రాన్ని సందర్శించిన పెబ్బేరు మత్స్య కళాశాల విద్యార్థుల బృందం

గరిడేపల్లి, అక్టోబర్ 1 (జనం సాక్షి): పెబ్బేరు మత్స్య కళాశాలలో బి యస్సీ ఫిషరీస్ నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల బృందం కెవికె క్షేత్రాన్ని సందర్శించినట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అధిపతి లవకుమార్ తెలియజేసారు. పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో మూడు నెలలపాటు క్షేత్ర స్థాయి అనుభవం పొందు తున్న 23 మంది విద్యార్దిని విద్యార్దులు బృందం కోర్స్ లో భాగంగా మత్స్య వ్యవసాయ అనుబంధ రంగాలలో అవగాహన సందర్శనలో అవగాహన కల్పించినట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మత్స్య సంపద అభివృద్ధికి అవసరమైన నూతన పరిజ్ఞానం సమగ్ర మత్స్య పెంపక విధానాలు మిశ్రమ చేపల పెంపకం పాలీ కల్చర్ నూతన జాతుల పెంపకం అజోల్లా సాగు వివిధ వ్యాధుల నివారణకు వాడే రసాయానాలు అదనపు ఆహారంగా దాణా వాడకం వల్ల కలిగే లాభాలు మొదలగు అంశాల గురించి వివరించారు. మృత్తిక శాస్త్రవేత్త కిరణ్ చేపల చెరువుల నిర్మాణానికి మట్టి నమూనా సేకరణ పరీక్షల ద్వారా కలిగే లాభాలు నిర్వహణ యాజమాన్యం గురించి వివరించారు. ఆదర్శ్ మాట్లాడుతూ చేపల పెంపకం లో జీవన ఎరువులు జీవ సంబంధ ద్రావణల వాడకం వల్ల చెరువుల్లో ప్లవకల అభివృద్ధి జరిగి చేపలు ఆరోగ్యంగా పెరుగుతయనీ అన్నారు. అనంతరము విద్యార్థుల బృందం కెవికె లోనీ చేపల పెంపకం కుంటలు భూసార పరీక్షా కేంద్రం జీవన ఎరువుల ఉత్పత్తి విభాగం అజోల్లా సాగు వర్మీ కంపోస్టు వర్మీ వాష్ ఉద్యాన వన నర్సరీ పుట్టగొడుగుల పెంపకం మొదలగు క్షేత్రాలను సందర్శించి అవగాహన పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు సుగంధి, నరేష్, నరేష్, మత్స్య పరిశోధన కేంద్రం పాలేరు శాస్త్రవేత్త రవీందర్ లతో పాటు 18 జిల్లాలకు చెందిన 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు.