కేంద్ర ప్రభుత్వం అసమర్ధత పాలన విడలి: సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్

రాయికొడ్ జనం సాక్షి సెప్టెంబర్ 25  రాయికొడ్  మండల పరిధిలోని మహ్మదాపూర్ గ్రామ సర్పంచ్ మరియు జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు జమ చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్ పాటిల్ కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను ఇంతవరకు జమ చేయలేదని అదేవిధంగా గ్రామపంచాయతీలకు ప్రత్యేకమైన ఎకౌంటు ఓపెన్ చేయమంటే ప్రతి గ్రామపంచాయతీ వాళ్లు గ్రామపంచాయతీ అకౌంట్ తీసినప్పటికీ ఇప్పటికీ నిధులను జమ చేయలేదని సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ ఆరోపించారు, నిధులు గ్రామ పంచాయతీ అకౌంట్లకు జమ చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులు మరియు గ్యాస్ , పెట్రోల్, డీజిల్ వంటి వస్తువుల ధరలు పెంచడంలో చూపించిన అత్యుత్సాహం, ప్రజల యొక్క అభివృద్ధికి ఉపయోగపడే నిధులను విడుదల చేయడంలో జాప్యం చేయడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యమవుతుందని, పంచాయతీ నిధులు అంటే గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు ఉపయోగపడే నిధులని కేంద్ర ప్రభుత్వం మర్చిపోయి కార్పొరేట్ సంస్థల పై ఉన్న ప్రేమలో కొంతైనా పేద ప్రజలపై చూపించాలని ,కేంద్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.