కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి -సీపీఎం డిమాండ్

గరిడేపల్లి, జూలై 8 (జనం సాక్షి): సీపీఎం పార్టీ గరిడేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వంట గ్యాస్ పెంపుదల వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాల అధిక ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ అబ్బిరెడ్డి గూడెం గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి షేక్ యాకుబ్ మాట్లాడుతూ ప్రజలు ఇప్పుడిప్పుడే కరోనా నుండి తెరుకుంటున్న సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పెట్రోల్ డీజల్ వంట గ్యాస్ ధరలను విపరీతంగా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పరిస్థితి ఉందని ప్రజలు మోయలేని పెను భారాలు ప్రభుత్వా లు వేస్తున్నాయని ఆయన అన్నారు.వంట గ్యాస్ ధరలకు సంబంధించి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.500 ఉన్న ధర నేడు రూ.1105 కు పెరిగిందని సబ్సీడీ పూర్తిగా ఎత్తివేసి ప్రజలకు ఏ మాత్రం సబ్సీడీ ఇవ్వని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్లరూపాయల రుణాలు మాఫీ చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం యొక్క విధానాలపై ప్రజలు ఐక్యంగా గళం ఇప్పలన్నారు. రేషన్ డిపోల ద్వారా కేవలం బియ్యం అందించి చేతులు దులుపుకుంటున్నారని అలా కాకుండా అన్ని రకాల నిత్యావసర సరుకులు కిరోసిన్ పంచదార వంట నూనె పప్పు చౌక ధరల పై ప్రజలకు అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ పెట్రోలు డీజిల్ కరెంట్ బస్సు చార్జీలు ఇంటి పన్ను భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్న అధిక ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర  ప్రభుత్వం ని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలోవెంకటమ్మ,నిర్మల,నంద్యాల పద్మ, హామదాబీ, లలిత,
ఎల్లమ్మ,అజీమా,సైదమ్మ,భవాని,లక్షమ్మ,సోమమ్మ,భద్రమ్మ, చంద్రకళ, కలమ్మ, లచ్చిరెడ్డి, శేషిరెడ్డి, తిరపయ్య, సైదయ్య, షేక్ హుస్సేన్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.