కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్

 

అచ్చంపేట ఆర్సీ,29 జులై, (జనం సాక్షి న్యూస్ ) :కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగుల ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల వికలాంగులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ఉద్యోగాలలో వాటా తగ్గిస్తున్నారని దీనికి సాక్ష్యం లోక్ సభ లో స్వయంగా మంత్రి విజేందర్ సింగ్ వెల్లడించినట్లు ఆయన తెలిపారు .కేంద్ర ప్రభుత్వం 2016 వికలాంగుల చట్టాన్ని ఉల్లంఘిస్తుందని మండిపడ్డారు.ఎన్నో ఇబ్బందులకు గురియై ఉన్నత విద్యను అభ్యసించిన వికలాంగులకు సరైన ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో వికలాంగుల వాటాను పునరుద్దరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఐదు శాతం రిజర్వేషన్ కాగితాలకే పరిమితం కాకుండా అన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో అమలు చేయాలని కోరారు.స్థానిక సంస్థల నుండి పార్లమెంట్ వరకు దివ్యంగులకు రాజకీయాలలో కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.