కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎగ్జిబిషన్‌

జ్యోతినగర్‌లో ప్రదర్శించిన కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ

రామగుండం,అక్టోబర్‌ 24(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పేదలకు గ్రావిూణ యువకులకు మహిళలు, దళితులకు రైతుల అభివృద్దికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికి వాటికి విస్తృత ప్రచారం లేకపోవడంతో ప్రజలకు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఫోటో ఎగ్జిబిషన్‌ ద్వారా ప్రచారకార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో బాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ జ్యోతినగర్‌లో ఎగ్జిబిషన్‌కార్యక్రమాన్ని చేపట్టగా ఎన్టీపీసీ జీఎం (ఓఅండ్‌ఎం) రవింద్ర ప్రారంభించారు. ఈసందర్బంగా రవీంద్ర మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ది పథకాలు లొక్‌సభ, రాజ్యసభ దూరదర్శన్‌ మాత్రమే ప్రసారం చేస్తున్నాయన్నారు ఈపోటో ఎగ్జిబిషన్‌తో రామగుండం ప్రాంతంలో ఉన్న కార్మికులు, వివిద వర్గాల ప్రజలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఫోటో ఎగ్జిబిషన్‌ అదికారి సురేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవర్గానికి ఏమేం ఉన్నాయి,  వాటిని లబ్దిదారులు ఏవిదంగా పొందవచ్చనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 26 పట్టణాల్లో ఈ ప్రదర్శనలు చేశామన్నారు.