కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08 : పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్‌టీ విధించడం దుర్మార్గమైన చర్య అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచం అగ్రగామిగా ఉందన్నారు. 2017 జూలై వరకూ పాలు, వాటి ఉత్పత్తులపై పన్నులు లేవని, ఆ తర్వాత పాలు పెరుగు, మజ్జిగలను మినహాయించి మిగిలిన వాటిపై 5 శాతం పనులు వేశారని గుర్తు చేశారు. జూన్ 28, 29 తేదీల్లో జరిగిన 47వ జీఎస్టీ సమావేశంలో పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్లపై 5 నుండి 12 శాతం, డెయిరీల్లో వినియోగించే యంత్రాలపై 12 నుండి 18 శాతం జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. పాడి పరిశ్రమలపై ఆధారపడిన సూక్ష్మ చిన్న, మధ్య, తరహా పరిశ్రమలను కార్పొరేట్లకు అప్పగించటానికే పాల పరిశ్రమపై కేంద్రం పన్నుల భారాన్ని మోపిందని విమర్శించారు. రైతులకు, ప్రభుత్వ డెయిరీలకు, వినియోగదారులకూ ఈ విధానాలను తీవ్ర నష్టమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు దానిపై ఆధారపడిన అన్ని వస్తువుల ధరలు సహజంగా పెరుగుతాయని, ఇది చాలదన్నట్టు పాడి రైతులను, వినియోగదారులను దెబ్బతీసేలా పన్నులు పెంచటం అన్యాయమని మండిపడ్డారు. ఈ విధానం వల్ల సూక్ష్మ ,చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడతాయని, వినియోగం తగ్గి, మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం మరింత పెరుగుతుందని వివరించారు. పన్నుల పెంపు, పాల ఉత్పత్తుల దిగుమతుల వల్ల ప్రభుత్వ డెయిరీలు, మూతపడి, ప్రైవేటు డెయిరీలు రంగంలోకి వస్తాయని, ఫలితంగా పాల కల్తీ మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. పౌష్టికాహారంగా ఉపయోగించే పాలు, వాటి ఉత్పత్తులపై జీఎస్‌టీ దారుణమన్నారు. కేరళ తరహాలో పాడి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈసమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధులు, గుడెపు సుదర్శన్, పల్లెమేని రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. Attachments area
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి.
దేశానికి స్వాతంత్రమ సిద్దించి 75 సం.రాలు పూర్తి అయిన సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్య శాఖ, పోలీస్, ఆర్టీవో , మున్సిపల్,ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యలతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పాఠశాల పిల్లలందరికి 9 రోజులలో గాంధీజీ సినిమాను చూపించేందుకు జిల్లాలోని 9 దియేటర్లను ఎంపిక చేసి సంబందిత ఏర్పాట్లను పూర్తి చేసిన్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 9 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు 3 రోజులు 16 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు 6 రోజులు మొత్తం కలిపి 9 రోజులు, ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు మహాత్మా గాంధీ సినిమా చూపించేందుకు జిల్లా విద్య శాఖ అధికారి , సంబందిత అధికారులు సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చేసిన్నట్లు , సినిమా ఉదయం 10 గంటల నుండి 01.15 వరకు ఉంటుందని పాఠశాల నుండి సినిమా ధియేటర్స్ కు తీసుకవచ్చి, సినిమా తిలకించిన తరువాత తిరిగి వారిని పాఠశాలలో వదిలే విధంగా బస్సులను ఏర్పాటు చేసిన్నట్లు ఆమె తెలిపారు. ప్రతి రోజు 3,610 మంది పిల్లలు సినిమా తిలకించేoదుకు ధియేటర్ వారీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన్నట్లు ఆమె తెలిపారు.
పాఠశాల పిల్లలను సినిమా ధియేటర్ కు తీసుకవెళ్లిన తరువాత పోలీస్ సిబ్బంది ఒకరు, రెవెన్యూ సిబ్బందిని ఒక్కరూ, ఆర్టీవో నుండి ఒకరు, మున్సిపాలిటీ నుండి ఒకరు సంబందిత పాఠశాల ఉపాధ్యాయులు ఒకరు పిల్లలతో ఉంటారని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిరిగి పాఠశాలకు చేర్చాలని కలెక్టర్ సంబందిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఏసీపీ వెంకట్ రెడ్డి, జిల్లా విద్య శాఖ అధికారి నారాయణ రెడ్డి, ఆర్టీవో , కొ-ఆర్డినేటర్ ఆండాలు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఖాజా మైనుద్దీన్, ఎం ఈ ఓ లు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సభ్యులు , సంబందిత అధికారులు పాల్గొన్నారు.