కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైస్ మిల్లుల పరిశ్రమలను కాపాడాలి..

ఆగిపోయిన ప్రోక్యూర్మెంట్ ను పదిరోజుల్లో పునరుద్ధరించాలి…

రైస్ మిల్ పరిశ్రమలపై కేంద్రం రాజకీయం వద్దు..

 

రైస్ మిల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి మోహన్ రెడ్డి …

బ్యూరో,జులై 15(జనంసాక్షి):
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైస్ మిల్లుల పరిశ్రమలను కాపాడాలని రైస్ మిల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి మోహన్ రెడ్డి అన్నారు ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల నాలుగు వందలు రైస్ మిల్లులు లోగత 40 రోజుల నుండి సేకరణ నిలిపివేయడంతో పరిశ్రమల పరిస్థితి జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. గత నలభై రోజులుగా పరిశ్రమలు మూగ పోయాయని రైస్ మిల్ పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు .అంతేకాకుండా ట్రాన్స్పోర్టు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ,గోదాముల్లో పనిచేసే కార్మికులకు పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అదేవిధంగా రైస్ మిల్లులో పనిచేసే ఇతర రాష్ట్ర కార్మికులు పని లేక వారి ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారని అన్నారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో 1700 ఉన్న రైస్ మిల్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 3420 రైస్ మిల్లు అయ్యాయని దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా సహకరించాయని అన్నారు. గత 78 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించినందుకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత నలభై రోజుల నుండి రైస్ మిల్లు నష్ట పోతుంటే కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 94లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం నిల్వలు ఉన్నాయని, గతంకంటే తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు విపరీతంగా పెరిగిందని దీనివల్ల వరి పంట ఇంకా రెండు మూడు నెలల్లో కొత్త ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని ప్రస్తుతం ఉన్న 94లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేకరణ చేసినట్లయితే రాబోయే కొత్త ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు వేసిన పంటలు పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. తమ తప్పులు ఏమైనా ఉంటే వాటిని సవరించుకొని పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత తమదని అన్నారు. కేవలం 2,లేదా 3 రైస్ మిల్లర్ల తప్పుల వల్ల రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లుల పరిశ్రమపై దెబ్బ తీయ వద్దు అని ఈ సందర్భంగా ఆయన కోరారు .చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు కేంద్ర మంత్రిలు కిషన్ రెడ్డి,పీయూష్ గోయల్ లు తమకు ఏదైనా రాజకీయ విభేదాలు ఉంటే తాము రాజకీయంగా చూసుకోవాలని పరిశ్రమలపై కక్ష సాధింపు వద్దని ఈ సందర్భంగా విన్నవించుకున్నారు గత 50 సంవత్సరాల చరిత్ర గల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ,దేశంలో సంక్షోభం ఏర్పడ్డపుడు, గిడ్డంగుల్లో ధాన్యం విపత్తు పరిస్థితిలో ఉపయోగించుకుంటారని అన్నారు .అలాంటి ఆహార సమస్యను నిర్వీర్యం చేయవద్దని ప్రజలకు సంక్షోభం ఏర్పడినప్పుడు దానికి ఉపయోగించాలని ఇప్పటికే పిడి ఎస్ ద్వారా
ప్రజలకు బియ్యము అందిస్తున్నారని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగినప్పుడు పరిశ్రమలు పరిశ్రమలకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు రైతులు అండగా ఉంటాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రాలో ఉన్నా రైస్ మిల్లర్ల పై కనికరించని, రాష్ట్రంలో గత నలభై రోజుల నుండి సేకరణ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు .ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పై దృష్టి సారించి తమ ఆవేదనను అర్థం చేసుకొని పది రోజుల్లోప్రోక్యూర్మెంట్ ప్రారంభించాలని విన్నవించుకున్నారు .మీడియా సమావేశంలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దయానంద్ గుప్త కార్యనిర్వాహక కార్యదర్శి ప్రణయ్ కుమార్ ఉప ఆధ్యక్షుడు కాపర్తి శ్రావణ్ కుమార్ ,గంజ్ అధ్యక్షులు లాబీ శెట్టి శ్రీనివాస్, రైస్ మిల్ అసోసియేషన్ కోశాధికారి ఆర్ చందు కే కరుణాకర్ ఎస్ అభినయ్ ఆర్మూర్ అధ్యక్షులు మునీర్ జాయింట్ సెక్రెటరీ వి సూర్య ధర్పల్లి అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.