కేజీబీవీ ఉపాధ్యాయిని ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం టీపీటీఫ్

జిల్లా ఉపాధ్యక్షులు సోమరపు ఐలయ్య
మండల శాఖ అధ్యక్షుడు చిక్కాల సతీష్
పెద్దవంగర నవంబర్ 15(జనం సాక్షి )కేజీబీవీ ఉపాధ్యాయిని ల సమస్యల పరిష్కారం కొరకై రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మూడు దశల పోరాటం లో బాగంగా మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ముందు టీపీటీఫ్ మండల శాఖ అధ్యక్షులు చిక్కాల సతీష్ ఆధ్వర్యం లో ఆందోళన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా టీ పి టీ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సోమారపు ఐలయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్ టి, బి సి, మైనారిటీ, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఆడపిల్లలకు మంచి విద్యను అందించాలని ఉద్దేశ్యం తో స్థాపించిన కేజీబీవీ లలో పనిచేస్తున్న బోధన,బోధనేతర సిబ్బంది పనుల బారం వలన మానసిక ఒత్తిడి కి గురవుతున్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయకుండా గురుకులాల కు ఏ మాత్రం తీసిపోకుండా పని చేయిస్తూ చాలీచాలని జీతాలు ఇస్తు శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు.ఉద్యోగ భద్రత లేకుండా,వైద్య సదుపాయాలు కల్పించకుండా కనీసం ఉన్న సెలవులు వాడుకోకుండ ఎన్నో ఆంక్షలు విధిస్తున్నారు.కావున ఇట్టి కాంట్రాక్ట్ పద్ధతి ని తొలగించి రెగ్యులర్ ఉపాధ్యాయులు గా గుర్తించాలని,రాత్రి విధులు నుండి తప్పించి మాట్రిన్ లను నియమించాలని ,కళాశాలలు గా అప్గ్రేడ్ చేసిన చోట తక్షణమే అదనపు సిబ్బంది ని నియమించాలని,అదనపు తరగతి గదులు నిర్మించాలని,విద్యార్థిని లకు సదుపాయాలు కల్పించాలని,అన్ని కేజీబీవీ లలో నీటి,విద్యుత్తు మరియు పాఠశాల నిర్వహణ కొరకు నిధులు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని అన్నారు
నవంబర్ 26 న జిల్లా కేంద్రాలలో,డిసెంబర్ 3 న డైరెక్టర్ కార్యాలయం ముందు జరిగే నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి దారవత్ దేవేందర్ నాయక్ టీపీటీఫ్ నాయకులు ప్రతాప్ రెడ్డి ,నరేష్,ఆంజనేయులు,వెంకటేశ్వర్లు, యుగేందర్,వెంకటేశం,శ్రీనివాస్ కేజీబీవీ సిబ్బంది సైదమ్మ,కల్యాణి,స్రవంతి,సరిత,కల్యాణి,సంధ్యారాణి,రేణుక,సంధ్య,బోధనేతర సిబ్బంది మమత,విజయలక్ష్మి,సుజాత,పద్మ,జ్యోతి,సుమలత ,పాల్గొన్నారు