కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

సుప్రీంలో చుక్కెదురు.. మధ్యంతర బెయిల్‌ పొడిగింపునకు నో
2న యధావిధిగా లొంగిపోవాలని ఆదేశం
న్యూఢల్లీి,ఢల్లీి,మే29 (జనంసాక్షి)
ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని పిటిషన్‌ దాఖలు చేయగా దానిని కోర్టు తిరస్కరించింది. కేజీవ్రాల్‌ దరఖాస్తును స్వీకరించేందుకు కోర్టు రిజిస్టీ నిరాకరించింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ కేజీవ్రాల్‌కు ఇచ్చింది. కేజీవ్రాల్‌ దరఖాస్తు విచారణకు అర్హమైనది కాదు. ఇప్పుడు సీఎం కేజీవ్రాల్‌ జూన్‌ 2న లొంగిపోవాల్సి ఉంటుంది. మే 10న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా కేజీవ్రాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. జూన్‌ 2న తీహార్‌ జైలులో లొంగిపోవాలని కోరారు. మే 17న పీఎంఎల్‌ఏ కేసులో అతని అరెస్టు చట్టబద్ధతపై సవాలు చేస్తూ ఈడీపై ధర్మాసనం తన తీర్పును రిజర్వ్‌ చేసింది. మంగళవారం, సుప్రీంకోర్టులోని మరో బెంచ్‌ కూడా కేజీవ్రాల్‌ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. సీజీఐ డీవై చంద్రచూడ్‌ను సంప్రదించాలని కోరింది. అరవింద్‌ కేజీవ్రాల్‌ అకస్మాత్తుగా ఆరేడు కిలోల బరువు తగ్గినందున అనేక వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ వ్యవధిని ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తిరిగి జైలుకు వెళ్లేందుకు కోర్టు నిర్దేశిరచిన జూన్‌ 2న కాకుండా జూన్‌ 9న లొంగిపోవాలని కేజీవ్రాల్‌ మే 26న దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

మోడీ కొనసాగితే పుతిన్‌లాగే నియంతృత్వం : కేజ్రీవాల్‌
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిరచడమే తమ లక్ష్యమని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢల్లీి సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్‌తో జతకట్టామని, ఇది శాశ్వతం కాదని స్పష్టంచేశారు. ప్రస్తుతం దేశంలో నియంత పాలన, గుండాగిరి నడుస్తుంది.. దీనికి చరమ గీతం పాడడం కోసమే కాంగ్రెస్‌ పార్టీతో ఆప్‌ పొత్తు పెట్టుకుందని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్‌ పార్టీతో ఆప్‌ పొత్తు శాశ్వతంగా ఉండదని ఈ సందర్బంగా కేజీవ్రాల్‌ కుండ బద్దలు కొట్టారు. బుధవారం విూడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీవ్రాల్‌ మాట్లాడారు. జూన్‌ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వెలువడ నున్నాయని.. అందులో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని కేజీవ్రాల్‌ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఢల్లీిలోని 7 లోక్‌సభ స్థానాల్లోనే కాంగ్రెస్‌ పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. పక్కనే ఉన్న పంజాబ్‌లో మాత్రం ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యర్థి పార్టీలుగానే బరిలో నిలిచామని ఆయన వివరించారు. దేశాన్ని రక్షించడం కోసం.. బీజేపీని ఓడిరచడం కోసమే కాంగ్రెస్‌, ఆప్‌లు కలిసి ఒక అభ్యర్థిని బరిలో దింపామని కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. అయితే పంజాబ్‌లో బీజేపీకి మనుగడ లేదన్నారు. అలాగే ఢల్లీి మద్యం కేసు.. మనీ లాండరింగ్‌ వ్యవహారంలో తాను డిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. అయితే తాను సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ మాత్రమే కోరుకుంటుందని కేజీవ్రాల్‌ పేర్కొన్నారు. ఇక బీజేపీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రం దేశంలో ప్రముఖ రాజకీయ నేతలంతా జైళ్లలోకి వెళ్లడం ఖాయమన్నారు. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే పుతిన్‌ సారథ్యంలో రష్యాలో పరిస్థితి ఎలా ఉందో.. దాదాపు అదే పరిస్థితి భారత్‌లో వస్తుందన్నారు.