కేటీఆర్ ఓ మూర్ఖుడు
– సోనియాను అనే స్థాయి కేటీఆర్‌కు లేదు
– పాలించడం చేతకాకే అసెంబ్లీని రద్దుచేశారు
– టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే గడీల రాజ్యానికి వేసినట్లే
– కాంగ్రెస్‌నేత పొన్నం ప్రభాకర్
కరీంనగర్, అక్టోబర్1(జనంసాక్షి) : సోనియాను దూషించిన కేటీఆర్ ఓ మూర్ఖుడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ సోనియా లేకపోతే కేటీఆర్, కవిత ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. ఢిల్లీకి గులాంలు అంటూ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే గడీల రాజ్యానికి ఓటు వేసినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. గడీల పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. పాలన చేతగాకే నాలుగున్నర ఏళ్లకే అసెంబ్లీని రద్దు చేశారని విమర్శించారు. భారత పౌరసత్వం లేని వ్యక్తికి మళ్ళీ వేములవాడ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్‌కు కొండగట్టు ప్రమాద మృతులను పరామర్శించే తీరిక లేదని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేసిన పథకం ఏదో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల పాటు ప్రజలకు అమలుకాని హావిూలు ఇస్తూ పబ్భం గడుపుకున్నారని అన్నారు. రైతులకు అండగా ఉంటున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్.. భూస్వాములకు మేలు చేస్తున్నారని విమర్శించారు. రైతుబంధు పథకంలో నిజమైన రైతులకు పూర్తిస్థాయిలో చెక్కులు అందలేదని, అదేవిధంగా కౌలురైతులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఇలా చేస్తే దేశానికి తెలంగాణ రైతు ఆదర్శంగా ఎలా నిలుస్తాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ విస్మరించారని, అభివృద్ధి చేస్తామని చెబుతూ.. కేవలం బర్రెలు, గొర్రెలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. కేసీఆర్
పతనం ప్రారంభమైందని, పేదవర్గాల ప్రజలు కేసీఆర్‌పై తిరగబడేందుకు సిద్ధమరయ్యారని, గడీల పాలనకు స్వస్తి చెప్పేందుకు సిద్ధమయ్యారని అన్నారు.