కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీపీ, జెడ్పీటీసీ

కుల్కచర్ల, జులై 24 (జనం సాక్షి):
సమాచార సాంకేతిక శాఖ మరియు పురపాలక శాఖా మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) జన్మదినం సందర్భంగా కుల్కచర్ల మండల పరిధిలోని చాపల గూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ గాంధీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజలు మెచ్చిన నాయకుడు కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి అందరికీ తమ అమూల్యమైన సేవలందించాలని భగవంతున్ని వేడుకొంటూ వారి పిలుపుమేరకు అందరికీ ప్రాణవాయువునిచ్చే మొక్కలను నాటడం జరిగిందని,వాటిని రక్షించుకునే బాధ్యత మనపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బృంగి హరికృష్ణ,టిఆర్ఎస్ పార్టీ కుల్కచర్ల, చౌడపూర్ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, సుధాకర్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షులు కేబీ రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు యాదవ్, వైస్ ఎంపీపీ రాజశేఖర్ గౌడ్, పాంబండ ఆలయ చైర్మన్ ఘనపురం రాములు, తెరాస మండల ప్రధాన కార్యదర్శి గజ్జి లక్ష్మయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ చంద్ర రెడ్డి, తెరాస నాయకులు మాలే కృష్ణయ్య గౌడ్, మఠం రాజశేఖర్, అంతారం మొగులయ్య, గుండుమల్ల నర్సింలు, జె వెంకటయ్య, చుక్కయ్య, బాబు, వెంకట్ రాములు, వినోద్, యాదగిరి, రాములు, చాపలగూడెం గ్రామస్తులు రాములు, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Attachments area