కేటీపీపీలో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి
వరంగల్ : ఘన్‌పూర్ మండలం చెల్పూర్ కేటీపీపీలో బాయిలర్ ట్యూబ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే నిపుణులు రంగంలోకి దిగి మరమ్మతు పనులు చేపట్టారు. విద్యుత్ పునరుద్ధరణకు రెండ్రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు.