కేయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా
వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 11 నుంచి జరగాల్సిన వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. హాల్‌టికెట్లు అందకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పరీక్షలను 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు.