కేయూ పీజీ కౌన్సిలింగ్ వాయిదా
వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో రేపటి నుంచి జరగాల్సిన మూడో విడత పీజీ కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు వర్సీటీ అధికారులు తెలిపారు. అధ్యాపకులు ఆందోళన కారణంగానే కౌన్సిలింగ్ వాయిదా వేశామని అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.