కేసముద్రం ఆన్ లైన్,డిటిపి,జిరాక్స్ అసోసియేషన్ ఎన్నిక

కేసముద్రం అక్టోబర్ 9 జనం సాక్షి /ఆదివారం రోజున కేసముద్రం ఆన్ లైన్,డిటిపి,జిరాక్స్ అసోసియేషన్ ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.స్థానిక హరిహర గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో కేసముద్రం మండల కేంద్రంలోని జిరాక్స్, డిటిపి,ఆన్ లైన్ షాపుల యాజమానులంతా పాల్గొని కమిటీని ఎన్నుకున్నారు.అసోసియేషన్ అధ్యక్షులుగా పాదర్తి వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శిగా నేరెళ్ల శ్రీనివాస్, కోశాధికారిగా గొర్రె రంజిత్, ఉపాధ్యక్షులుగా ఎం.డి.జావేద్, జమ్ముల కృష్ణ, సంయుక్త కార్యదర్శిగా రావు యాకూబ్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా భూక్యా నెహ్రు, ప్రధాన సలహాదారులుగా బండారు వీరబ్రహ్మం ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీలో పలువురు మాట్లాడుతూ పెరిగిన పేపర్, మెటీరియల్, విద్యుత్ ఛార్జీలు, షాపు కిరాయిలు, తదితర ముడిసరుకుల ధరలు పెరిగినా ఇన్ని రోజులు జిరాక్స్, ఇతర ఆన్ లైన్ సేవల రుసుము పెంచలేదని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాలని అసోసియేషన్ కార్యవర్గం తీర్మానించినందున వినియోగదారులు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో సభ్యులు చీదరి ఆనంద్, వలిశెట్టి శివ, వెన్ను బిక్షపతి, పూజారి అమరేందర్, సుగన్ సింగ్, సుంకరి మహేష్, గుండా వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.