కేసీఆర్‌కు ఓటమి భయం

– విపక్షంలో కూర్చొనే మనోధైర్యం ఆయనకు లేదు
– రాష్ఠాన్న్రి తన సొంత ఆస్తిలా ఫీలవుతున్నాడు
– కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు
– కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత జీవన్‌రెడ్డి
జగిత్యాల, నవంబర్23(జనంసాక్షి) : తనకు ఎన్నికల్లో ఓట్లేస్తే అధికారంలో ఉంటా.. ఓడిపోతే ఫాంహౌజుకే పరిమితమవుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రం తన సొంత ఆస్తిలా కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కల్వకుంట్ల కుటుంబం అధికారం కోసం పడుతున్న తాపత్రయం కనిపిస్తోందని ఎద్దేవాచేశారు. ప్రతిపక్ష ¬దాలో కొనసాగే మనోధైర్యం లేకే వైదొలగాలని చూస్తున్నారన్నారు. కొడుకు కేటీఆర్ సన్యాసం చేస్తామనడం.. తండ్రి కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితమవుతానని చెప్పడం బట్టి చూస్తుంటే.. ఓటమి భయంతోనే వారు అలా మాట్లాడుతున్నారని అర్థమవుతోందన్నారు. అవకాశానికి మారుపేరు కేసీఆర్ అని విమర్శించారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ అర్థాంతరంగా ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలను తీసుకొచ్చి బలవంతంగా ప్రజలపై రుద్దే విధంగా కేసీఆర్ చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. అలాగే సీఎం తనయుడు కేటీఆర్ అనుభవ రాహిత్యంతో మాట్లాడుతుంటే కేసీఆర్ కూడా అదే భాషలో మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం జగిత్యాల పట్టణంలోని తీన్ ఖనికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని జీవన్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.



