కేసీఆర్ ఏ ఒక్కహావిూని నేరవేర్చలేదు
– ఉమ్మడి కరీంనగర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఎక్కడా పూర్తిచేయలేదు
– అక్కసుతోనే కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు
– కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు
కరీంనగర్, అక్టోబర్1(జనంసాక్షి) : గత ఎన్నికల్లో ఇచ్చిన ఏఒక్క హావిూని కేసీఆర్ నెరవేర్చలేదనే అసంతృప్తితో ప్రజలు ఉన్నారని కాంగ్రెస్ నేత, మాజీమంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. సోమవారం ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో ఎక్కడా డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించలేదన్నారు. ప్రతిపక్షాలపై ఉన్న అక్కసుతోనే విపక్ష నేతలపై తప్పుడు కేసుల్లో ఇరికించాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మెజారిటీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హావిూలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అసంతృప్తితో ఉన్న ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలని చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. సోనియా లేకుంటే.. తెలంగాణ రాకపోయేదని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఒక్కసారి సోనియాకు ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నట్లు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా కనిపిస్తుందని శ్రీధర్‌బాబు అభిప్రాయం వ్యక్తంచేశారు. తెరాస ప్రభుత్వం నాలుగేళ్ల పాటు అనుసరించిన ప్రజా వ్యతిరేఖ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తెరాసకు పరాభవం ఖాయమన్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రాజెక్టులు, మిషన్ భగీరథ వంటి పథకాలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు కోట్లు దండుకున్నారని శ్రీధర్‌బాబు విమర్శించారు.