కేసీఆర్ కుటుంబం అవినీతిపై చర్చకు సిద్ధమా? తెదేపా నేత ఎర్రబెల్లి
వరంగల్: హైకోర్టు న్యాయవాదులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ కుటుంబం అవినీతిపై బహిరంగ చర్చకు తెరాస సిద్ధమా? అని ఆయన వరంగల్‌లో సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెరాస, వైకాపా, ఎంఐఎం పార్టీలన్నీ కలిసినా అధికారంలోకి రాలేరని అన్నారు.