కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు మరిచారు
– షబ్బీర్ అలీ
హైదరాబాద్,అక్టోబర్17(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే వెంటనే బీసీ కమిషన్ వేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. గతంలో ప్రకటించిన విధంగా నిధులు విడుదల చేయాలన్నారు. శనివారం ఆయన సామాజిక ఆర్థిక సర్వే కమిషన్‌కు ఓ మెమోరాండం సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. ముస్లింలకు జనాభాకనుగుణంగా 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు లేక ముస్లిం యువత విద్యకు దూరమవుతోందని ఆయన వాపోయారు. రిజర్వేషన్లు ఇస్తామన్న కెసిఆర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు.