కేసీఆర్ కి గిరిజన జాతి రుణపడి ఉంటుంది….

తెరాస యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవి నాయక్.

కురవి సెప్టెంబర్-18 (జనం సాక్షి న్యూస్)

కురవి మండల కేంద్రములో జరిగిన పాత్రికేయుల సమావేశంలో తెరాస యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవి నాయక్ మాట్లాడుతూ గిరిపుత్రులకు వరాల జల్లు కురిపించిన కెసిఆర్ ,డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ కి ఆత్మీయ సోదరి తెరాస మహబూబాబాద్ జిల్లా రథసారథి మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాళోత్ కవితమ్మ కి కృతజ్ఞతాభివందనాలు తెలియచేశారు.
➧సంపద పెంచడం, పేదలకు పంచడమే కెసిఆర్ సిద్ధాంతం.మా గిరిజన జాతి ఆడితప్పని జాతి.ఒక సారి మాటిస్తే,నమ్మితే ప్రాణం ఉన్నంత వరకు వారితోనే ప్రయాణం..
➧యావథ్ గిరిజనం కెసిఆర్ ,రెడ్యానాయక్ వెన్నంటే ఉన్నాం ఉంటాం ఇక ముందు మరింత చేదోడు వాదోడుగా ఉంటూ వెయ్యేనుగుల బలమైతాంఅని అన్నారు.
మావా నాటే,మావా రాజ్ (మా తండాలో మా రాజ్యం) అని దశాబ్దాలుగా గిరిజన సోదరులు కోరినా.ఏ నాయకులు స్పందించలే..
ఎన్నికలపుడు చెప్పిన విధంగా 3 వేల పైచిలుకు గిరిజన తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కెసిఆర్ ది, పలుమార్లు ఆదిశగా పట్టుబట్టి ఎనలేని కృషి చేసిన మహనీయులు రెడ్యానాయక్..
➧బంజారా జాతి ఆత్మగౌరవ ప్రతీక గా గిరిజ‌నులకోసం హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున బంజారాహిల్స్‌ లో రూ.60 కోట్లతో , సేవాలాల్ బంజారా భ‌వ‌న్‌ని నిర్మించి జాతికి అంకితం చేసిన ఘనత కెసిఆర్ దే..
➧ఏ ముఖ్యమంత్రి,ఏనాయకుడు చేయని సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇవ్వడం సర్వత్రా హర్షణీయం .
➧ తెలంగాణలో భూమిలేని నిరుపేద గిరిజనులకు ఇంటికి 10 లక్షల రూపాయలిచ్చి ఆదుకునే ‘గిరిజన బంధు’ మరియు ..చాలామంది గిరిజ‌న ఉద్యోగులు, మేధావులు, క‌వులు, ర‌చ‌యిత‌లున్నరు.వారికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తాననడం➧ గిరిజనుల సమస్యల ప‌రిష్కారానికి శాస్త్రీయ దృక్ప‌థంతో మా గిరిజ‌న సోద‌రుల కోసం తండాల‌ను పంచాయ‌తీలుగా చేసి స్వయం పాలన ప్రాతినిధ్యం.. కెసిఆర్ ఘనతే..
➧ విదేశాల్లో చదివే ఎస్టీ విద్యార్థులకు రూ. 20 ల‌క్ష‌ల ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్స్ ఇచ్చి వారి బంగారు భవిష్యత్తుకు తోడ్పాటునందించడం.దూర ప్రాంతాలకు వెళ్లి మంచినీటిని తెచ్చుకునే మా గిరిజన ఆడబిడ్డ ల కష్టాలను చూసి మిష‌న్ భ‌గీర‌థ ద్వారా తండాల‌కు, గూడెంల‌కు మంచినీరు అందించి భగీరథుడు కెసిఆర్ గారన్నారు..అమాయ‌కులైన గిరిజ‌నులు పోడు వ్య‌వ‌సాయం చేస్తున్నారని. వారికి ఇవ్వ‌డానికి పోడు భూములను గుర్తించి హక్కులివ్వడం. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం, కమిటీల నిర్మాణానికి 140 నంబరు జీవో ఏర్పాటు చేసి త్వరలోనే ఈ కమిటీలు సమావేశమై నివేదికలిస్తే… పోడు భూములకు పట్టాలిస్తామని, పోడు భూములకు రైతుబంధు కూడా ఇస్తానని చెప్పడం, గిరిజనుల ప్రత్యేక సంస్కృతిని కాపాడుతూ గిరిజన పండుగలు, జాతరలను ప్రభుత్వమే వందల కోట్లతో నిర్వహించడం గర్వకారణమన్నారు..యావత్ బంజారాలు
ఇంతటి మహత్తరమైన నిర్ణయం తీసుకున్ళ కెసిఆర్ కి, ఆ దిశగా పలుమార్లు ప్రయత్నం చేసినఎమ్మెల్యే రెడ్యానాయక్,యంపి, మహబూబాబాద్ జిల్లా రథసారథి మాళోత్ కవితమ్మ ,టిఆర్ఎస్ పార్టీకి ఋణపడి ఉంటాం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ చైర్మన్ బాదావత్ రాజునాయక్,యూత్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణోత్ రమేష్,కురవి మాజీ సర్పంచ్, మండల నాయకులు బాణోత్ తుకారాంనాయక్,నారాయణ పురం ఉప సర్పంచ్ ధారవత్ భాస్కర్,సోషల్ మీడియా మండల అధ్యక్షుడు మాలోత్ సూర్య,ఆలయ ధర్మకర్త గుగులోతు అశోక్, టిఆర్ఎస్ యూత్ నాయకులు బాణోత్ గణేశ్,టిఆర్ఎస్ నాయకులు మూడ్ శ్రీను,బాణోత్ రఘు తదితరులు పాల్గొన్నారు.