కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ఉప్పల్, అక్టోబర్ 19 (జనం సాక్షి) : రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని టిఆర్ఎస్ అధినేత ఆపద్బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలపడంతో తెలంగాణ రెడ్డి సామాజిక సార్వజనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కంసాని సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి, సంఘం సభ్యులు ఆకిటి బాల్ రెడ్డి, రఘుపతి రెడ్డి లు మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తే పేద రెడ్డి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఉప్పల్ తెలంగాణ ఉద్యమ నేత, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బేతి సుభాష్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో రెడ్డి సోదరులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపినందుకు కేసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి, హరినాద్ రెడ్డి, హరి మెషన్ రెడ్డి, వి సంతోష్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, అకిటి అంజిరెడ్డి, చింతల నర్సిరెడ్డి, సంపత్ రెడ్డి, పాపి రెడ్డి, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, యాది రెడ్డి , నాగిరెడ్డి, నర్సిరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.