కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆస్తి
పంట నష్టలను తెలుసుకోవడానికి
తెరాస మండల నాయకుల రుద్రూర్ మండల పర్యటన
రుద్రూర్ మండలంలో ప్రజలకు సమస్యలు రాకుండా సమన్వయంతో పని చేస్తున్న
తెరాస మండల నాయకులు , ప్రభుత్వ అధికారులు
(జనంసాక్షి): గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వుండేలా మండల అధికారులు, నాయకులు ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటు ప్రజాలకు అందుబాటులో వున్నారు, గురువారం సాయంత్రం నుండి వర్షాలు తగ్గుముఖం పట్టిన కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా శుక్రవారం ఉదయం నుండే మండల కేంద్రంలోని ఆయా గ్రామాలలో జరిగిన ఆస్తి నష్టం , పంటల నష్టం గురుంచి తెలుసుకోవడానికి మండల అధికారులతో కలిసి మండల తెరాస నాయకులు ఆయా గ్రామాల్లో పర్యటించరు, ఈ క్రమంలో వర్షాలకు దెబ్బ తిన్న బొప్పాపూర్ బ్రిడ్జి రోడ్డు ను మరియు బొప్పాపూర్ శివారులో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు
ఈ సందర్భంగా తెరాస మండల నాయకులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ పంచాయతీ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కొవిడ్, డెంగ్యూ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ తహసీల్దార్ ముజిబ్, జడ్పీటీసీ నారోజి గంగారాం, మండల పార్టీ అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, మండల నాయకుడు అక్కపల్లి నాగేందర్ , విండో ఛైర్మన్ సంజీవ్ రెడ్డి, ఏఓ నగేష్ రెడ్డి , కన్నె రవి, బాపూజీ లింగం, విఆర్వో జావేద్ తదితరులు ఉన్నారు



