కొండగట్టు బస్సు ఫట్‌నెస్ ఉన్నదే
జగిత్యాల,సెప్టెంబర్ 27(జనంసాక్షి): కొండగట్టు ఘాట్ రోడ్‌లో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు ఫిట్‌నెస్‌తోనే ఉందని డీవీఎం మద్దిలేటి పేర్కొన్నారు. బస్సు ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆర్టీవో అధికారులు జారీ చేసి న ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ఆయన విూడియాకు విడుదల చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ… బస్సు ఫిట్‌నెస్ సరిగా లేదనడంలో నిజం లేదని, అక్టోబర్ 4, 2018వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఇటీవల కొండగట్టు బస్సు బోల్తాపడిన ఘటనలో 62మంది మృతి చెందిన సంగతి తెలిసందే. ఇందులో డ్రైవర్ కూడా దుర్మరణం చెందాడు.