కొండపాక తహశీల్దార్ కార్యాలయం మార్పు

కొండపాక (జనంసాక్షి) జూన్ 14 : కొండపాక మండల సమీకృత కార్యాలయాల నిర్మాణం కోసం ప్రస్తుతం తహసిల్దార్ కార్యాలయం ఉన్న స్థలాన్ని చదును చేస్తున్న నేపథ్యంలో తహసిల్దార్ కార్యాలయాన్ని కస్తూరిబా బాలికల పాఠశాలకు ఎదురుగా ఉన్న ఉపాధి హామీ కార్యాలయంలోకి మార్చినట్లు తహసిల్దార్ అహ్మద్ హుస్సేన్ తెలిపారు.  ప్రస్తుత కార్యాలయానికి కొద్ది దూరంలోనే తాత్కాలిక కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల ప్రజలకు యధావిధిగా రెవిన్యూ శాఖ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.