కొండమల్లేపల్లి జడ్పీ హైస్కూల్లో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు
కొండమల్లేపల్లి అక్టోబర్ 15 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ప్రపంచ విద్యార్థుల దినోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక మారుమూల ప్రాంతంలో అతి పేద కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ స్థాయిలో గొప్ప మహనీయులుగా పేరుగాంచారు మన దేశానికి అణు పరిశోధనలు చేసి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పెద్ద సైంటిస్ట్ పేరుగాంచారు సాధారణ స్థాయి నుండి తమ జీవితాన్ని ప్రారంభించి గొప్ప గొప్ప యూనివర్సిటీలో విద్యార్థిని విద్యార్థులకు బోధన చేశారు భారత రాష్ట్రపతిగా తమ విలువైన సేవలు అందించారు మన కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నా చదువుల్లో గొప్పగా రాణిస్తే ప్రపంచ స్థాయికి ఎదగొచ్చు అన్నారు మట్టిలో మాణిక్యంలా గొప్ప గొప్ప మహానుభావులు చిన్న స్థాయి నుండి వారి జీవితం ప్రారంభించారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు కార్యక్రమంలో మంద సత్యనారాయణ, చేరుపల్లి శ్రీనివాస్, ఎబినేజర్, కొర్ర లోక్యా నాయక్, సముద్రాల శ్రీనివాస్, కే వెంకటేశ్వర్లు, సరస్వతి, కలమ్మ, నాగేంద్రమ్మ, శ్రీపతి రావు, అక్కిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఎండి హజార్ అలీ, చంద్రయ్య, సూర్య, సైదా నాయక్, దయాకర్, సీతారాం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు