కొండమల్లేపల్లి మండలంలోని జోగ్యా తండా లో పారిశుద్ధ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

కొండమల్లేపల్లి అక్టోబర్ 15 జనంసాక్షి : కొండమల్లేపల్లి మండలంలోని జోగ్య తండాలో పారిశుద్ధ్యం పడక వేసింది .ఎక్కడ చూసినా మురికి కాలువలు గుంతలు బురదలతో దర్శనమిస్తుంది. వర్షాకాలం కావడంతో అడుగు తీసి అడుగుపెట్టలేనంతగా రోడ్లు తయారయ్యాయని కొలిమంతల్ పహాడ్ ఎంపీటీసీ రాణి రాజు తెలిపారు. శనివారం గ్రామంలో పలు వీధులలో ఆయన పర్యటించి చెత్తాచెదారంతో కూడిన గ్రామంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. విద్యుత్తు స్తంభాలు నిలువ చేరిన నీటిలో ఉండడంతో విద్యుత్ షాక్కు కొట్టే ప్రమాదం ఉందని మంచినీటి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ రాణి ఎడల ప్రత్యామ్నాయ మంచినీటి సౌకర్యం బోరులు లేకపోవడంతో కాలనీ గ్రామస్తులు బోర్ల దగ్గరికి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. ఎక్కడ చూసినా చెత్తాచెదారం కనిపిస్తూ దుర్గంధ భరితంగా మారిందని తెలిపారు.