కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ బి

కొండమల్లేపల్లి అక్టోబర్ 9 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ముహమ్మద్ ప్రవక్త జన్మదిన రోజున ఈద్ మిలాద్ ఉన్ నబీ ఘనంగా జరుపుకున్నారు కొండమల్లేపల్లి పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో మస్జిద్ ఇమామ్లా ఆధ్వర్యంలో ముహమ్మద్ ప్రవక్త గారి సందేశాలను తెలియజేశారు ముహమ్మద్ ప్రవక్త గారు చాలా సాదాసీదా జీవితం గడిపారని ఈ ప్రపంచంలో సతీసహగమనం, వితంతువు వివాహాలు, శ్రీ హక్కుల కోసం, జాతి వివక్షతను, కులమతాల హెచ్చతగ్గులను దూరం చేయటానికి అనాధల శ్రామికుల శ్రేయస్సు కోసం, ఎందరో మహనీయులు మేధావులు సంఘసంస్కర్తలు ఎనలేని కృషి చేశారు కానీ ముహమ్మద్ ప్రవక్త గారు 1450 సంవత్సరాలకు పూర్వమే మానవ జీవితంలో ఎన్ని రంగాలు అయితే ఉన్నాయో ఆయా రంగాలన్నింటిలో ఆచరణాత్మక సంస్కరణలు చేసిన గొప్ప మహనీయులు ప్రస్తుత జనరేషన్ లో, టెక్నాలజీ ఉన్న ఉన్నప్పటికీ ముహమ్మద్ ప్రవక్త గారి ఆచరణలే తమ విధిగా ముస్లిం సోదరులు పాటిస్తారు ముహమ్మద్ ప్రవక్త గారు సకల చరాచర జీవులన్నింటినీ ప్రేమతో చూసేవారు ఏ ప్రాణిని కూడా కనీసం తన కంటి సైగ తోను కూడా ఇబ్బంది పెట్టలేదు ముహమ్మద్ ప్రవక్త గారు తల్లిదండ్రులను గౌరవించడం, తోటి వారికి సహాయం చేయడం, ఇతరులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం నేరమని, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం తప్పు అని తనకున్న దానిలోనే ఇతరులకు కొంత సహాయం చేయడం అని ప్రతి జీవిని కూడా మనసుతో ప్రేమించాలని ప్రతి విషయంలో నువ్వు సహనం పాటించాలని ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప మాటలు సర్వజనులకు తెలియజేసారు మన చట్టాలు, రాజ్యాంగాలు ఆవిర్భవించక ముందే మనిషి మనిషి లాగా బతకాలని నేర్పిన గొప్ప మహనీయులు ముహమ్మద్ ప్రవక్త గారని పేదలకు, వృద్ధులకు,వితంతువులకు, అనాధలకు, సహాయం చేయడం ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప అలవాట్లు ఆచరణలో పెట్టారని తమ కంటే వయసులో పెద్దవారిని మనస్ఫూర్తిగా గౌరవించడం తోటి వారికి సహాయం చేయడం ఇలాంటి ఎన్నో ఆచరణాత్మక గొప్ప సుగుణాలు పాటించి సర్వజనులకు దారి చూపారు ఈ లోకంలో చేసిన పాపపుణ్యాలే మనకు పునర్జన్మ లా ఉంటుందని ముస్లిం సోదరులు తెలియజేశారు ముహమ్మద్ ప్రవక్త గారి పవిత్రమైన జన్మదిన రోజున పట్టణంలోని ముస్లింలందరూ కొత్త బట్టలు ధరించి నమాజులకు వెళ్లి ఒకరినొకరు ఈద్ మిలాద్ ఉన్న నబీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు