కొండమల్లేపల్లి మండల కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘన నివాళులు
కొండమల్లేపల్లి అక్టోబర్ 15 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శనివారం నాడు మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించిన ఆలిండియా స్టూడెంట్ సోషల్ సర్వీస్ (AISS) కొండమల్లేపల్లి మండల కమిటీ ఈరోజు స్థానిక కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో నేడు భారతరత్న డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా AISS వ్యవస్థాపక అధ్యక్షుడు రామవత్ సేవ నాయక్ మాట్లాడుతూపీపుల్స్ ప్రెసిడెంట్’,ఏరోస్పేస్ సైంటిస్ట్ & ‘మిసైల్ మ్యాన్, డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం.ఆయన సైన్స్ రంగానికే కాకుండా యువత జీవితంలో మహోన్నతంగా ఆలోచించేలా ప్రేరేపించారాని తెలిపారు.యువకులు అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో AISS మండల అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సాయిరాం, కమిటీ సభ్యులు బన్ని,రాహుల్ గణేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.