కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 (జనం సాక్షి);
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణా ఉద్యమ కారకులు, స్వాతంత్ర్యఉద్యమములో చురుకుగా పాల్గొన్నారని, అయన ను స్పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ 107 జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ హాలు నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండాలక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం,నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం,ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబరు 27న జన్మించిన కొండా లక్ష్మణ్ న్యాయవాద విద్యను అభ్యసించి,ఉద్యమాలతో పాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తపించారని,తన జీవితాన్నే దేశసేవకు అంకితం చేసారని తెలిపారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారని,1952 ఎన్నికల్లో తొలిసారి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా లక్ష్మణ్, తర్వాత 1967,
1972లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారని అన్నారు. 1957-60 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్‌గా, అనంతరం దామోదరం సంజీవయ్య క్యాబినేట్‌లో ఎక్సైజ్, చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని, ఆయన ను అందరం ఆదర్శంగా తీసుకోవాలని, అయన అడుగుజాడల్లో నడవాలని కోరారు.ఈ సందర్బంగా చేనేత సంఘ ప్రసిడెంట్ రామకృష్ణ కాం బ్లే మాట్లాడుతూ బాపూజీ కళలు గన్న రాష్ట్రం లో మొట్టమొదటి సరిగా జిల్లా లో కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్ గారిని కోరారు.
సమావేశం లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్వేత ప్రియ దర్శిని, జిల్లా అధికారులు,పద్మ శాలి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.