కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
జనం సాక్షి ప్రతినిధి మెదక్
మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని మంగళవారం నాడు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారితో కలిసి ప్రారంభించారు.మంగళవారం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాపూజీ త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియాలి. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా జీవితాంతం అదే విలువలతో బతికారని ఆయన సేవలను కొనియాడారు.మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమనేత కేసీఆర్ కు కొండా లక్ష్మణ్ అండగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో
మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్ జగపతి,మున్సిపల్ వైస్ చైర్మన్ అరెళ్ల మల్లికార్జున్ గౌడ్, కౌన్సిల్ సభ్యులు బొద్దుల రుక్మిణి కృష్ణ గారు బీమరి కిషోర్ జయరాజ్ ఆర్కే శ్రీనివాస్, లక్ష్మీ నారాయణ గౌడ్,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్ మోహినొద్దిన్ నాయకులు మేడి మధుసూదన్ రావు రాగి అశోక్ లింగరెడ్డి దుర్గ ప్రసాద్ బాని నవీన్ తదితరులున్నారు.