కొడిచర్ల పాఠశాలలో కరోనా కాటు. 5 విద్యార్థులు,3 పేరెంట్స్కు కరోనా పాసిటివ్. భయాందొలనలలో గ్రామ ప్రజలు.

కోటగిరి జూలై 29 జనం సాక్షి:- కోటగిరి మండలం లోని పోతంగల్ పి.ఎచ్.సి పరిధిలోని కొడిచర్ల గ్రామంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా పని చేస్తున్న ఒక వ్యక్తికి గత రెండు రోజులుగా వొల్లు నొప్పులు,జ్వరం,జలుబు ఉండడం చేత ఆ వ్యక్తి యొక్క నెగిటివ్ ప్లేస్ అయిన రుద్రూర్లో గురువారం రోజున కరోనా టెస్ట్ చేసుకొనగా ఆయనకు పాసిటివ్గా నిర్దారణ అయింద.ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారులు పోతంగల్ పి.ఎచ్.సి పరిధిలోని ఆరోగ్య సిబ్బంది సమాచారం తెలుపగా వారు వెనువెంటనే కోడిచర్ల గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్న 101మంది విద్యార్థులకు,వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలునిర్వహించగా ఐదుగురు మంది విద్యార్థులకు,ముగ్గురు పెరెంట్స్కు కరోనా పాసిటీవ్గా నిర్దారణ అయినట్లు డాక్టర్ కరణ్ పటేల్ తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ వెంట హెల్త్ సూపర్ వైజర్ కృష్ణవేణి,గ్రామ సర్పంచ్ పుష్పాలత, ఎంపిడిఓ అతరుద్దిన్,వైద్య సిబ్బంది ఉన్నారు.