కొత్త జైపాల్ రెడ్డి అనుచరవర్గం కాంగ్రెస్ లో చేరిక
గంగాధర మండల సీనియర్ నాయకుడు, సింగిల్విండో చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి అనుచరవర్గం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి నియోజకవర్గం లోని పలు పార్టీల ఎంపీటీసీలు, యువకులు కాంగ్రెస్ జిల్లా నాయకులు కటుకం మృత్యుంజయం, చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చొప్పదండి నియోజకవర్గం లో భారీ మార్పులు చోటు చేసుకోబోతుందని వారి అనుచరవర్గం జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం విజయం తధ్యమని అన్నారు. గంగాధర చౌరస్తాలోని వి ఏ ఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం పాల్గొని జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు మరిచారని దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడం లో విఫలమైందని రైతులకు రుణమాఫీ సంగతి ఎట పోయిందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఒక్కటి కూడా నిర్మాణం చేపట్టలేదని, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టి, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రగల్భాలు పలికారు అని, పెన్షన్లు వెయ్యి రూపాయలు చేసి నాలుగున్నర ఏళ్ల కాలంలో నిత్యావసర ధరలు నాలుగు రెట్లు పెరిగాయి అని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఒక విద్యుత్ ఫ్యాక్టరీని పెట్టలేదని ఒక్క శంకుస్థాపన కూడా చేసింది లేదని, గోదావరి నీళ్లను రైతులకు అందించాలని అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు తెరాస ప్రభుత్వం అంబేద్కర్ పేరును రూపుమాపి కాలేశ్వరం ప్రాజెక్టు అని పేరు పెట్టాడు అని ఇప్పటివరకు ప్రాజెక్టులు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, ప్రాజెక్టులలో ఇండ్లు భూములు పోయేవి మనవి నీళ్లు మాత్రం గజ్వేల్ సిద్దిపేట కు తరలించకుందామని చూస్తున్నారు. ఇప్పటివరకు రైతులకు ఒక చుక్క నీరు కూడా అందించలేదని నియోజకవర్గంలో ఒక్క చెరువు కూడా కొత్తవి తవ్వించ లేదని, మిషన్ భగీరథ లో ఉన్న పైపులు పోయాయి కొత్త పైపులు పోయాయని 40 వేల కోట్ల రూపాయలను కాజేశారని, అవినీతి రాజ్యమేలుతుందని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఒక్క మహిళ కూడా మంత్రి పదవి చేపట్టలేదని, ఇంటికో ఉద్యోగం అని ఊర్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త జైపాల్ రెడ్డి రావడంతో సత్యం గెలుపునకు నాంది పలికారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ను గద్దె దించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కేసీఆర్ ఓట్ల దొంగని ఓట్లను దొంగతనం చేయకుండా ఓట్ల దొంగను పట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించాలని సత్యమును అధిక మెజారిటీతో అసెంబ్లీ కి పంపించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు దాదాపు నాలుగు వేల మంది కొత్త జైపాల్ రెడ్డి మిత్ర మండలి సభ్యులు, వారి అనుచరవర్గం నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.