కొత్త బాధ్యతలు సవాలే:సింధియా
ఢిల్లీ: కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ రంగంలో నిరుత్సహకర వాతవారణం నెలకొన్న నేపథ్యంలో కొత్త బాధ్యతలు తనకు సవాలేనన్నారు. కానీ, సాధ్యమైనంతవరకు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని, కొంత భయంతో కూడిన సవాలే నా శాఖ అధికారులు, సహచరుల మద్దతుతో సలహాలతో ముందు కెళతానన్నారు.