కొనసాగుతున్న ఆయుర్వేద వైద్య విద్యార్థుల నిరసన

వరంగల్ ఈస్ట్, నవంబర్ 01(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది.రద్దయిన మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసంనాలుగు రోజులుగా వివిధ రూపాలలో  నిరసన తెలిపిన స్పందన కరువు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థులు హాస్పటల్ గేట్లకు తాళాలు వేసి ముందు బైఠారించారు.
 గేటు బయట ఉండిపోయిన వైద్యులు, రోగులు, రోగుల కోసం వచ్చే అటెండెంట్ లు బంధువులు.
 ఆయుష్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు పునర్దరించేదాకా ఆందోళన విరమించేది లేదంటున్న విద్యార్థులు.ఈ ఘటనపై వెంటనే వైద్యశాఖ మంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్  చేస్తున్నారు