కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

డిపోల ముందు నిరసన ధ్వనులు

ప్రైవేట్‌ వాహనాల దోపిడీపై ప్రయాణికుల ఆగ్రహం

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి): ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన ఐదోరోజు రోజు కొనసాగింది. సమ్మెలో మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని తొమ్మిది డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పోలీసుల సహకారంతో ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులు తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లతో బస్సులు నడిపించారు. ఉదయం నుంచి బస్సులు బస్టాండ్ల నుంచి కదిలాయి. ఇకపోతే సమ్మెతో ప్రైవేట్‌ వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. ఆర్టీసీ బస్టాండ్‌ల ఎదుట ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లారు. కాగా సమ్మెతో ప్రైవేట్‌ వాహనాల్లో రోజువారీ కంటే అధికంగా డబులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, జడ్చర్ల, భూత్పూర్‌, నారాయణపేట, కల్వకుర్తి రూట్లలో ప్రైవేట్‌ వాహనాలు ఎక్కువగా నడిచాయి. మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ నుంచి హైదరాబాద్‌ రూట్లో అధిక బస్సులు నడిపించారు. దసరా పండుగ దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కువ బస్సులను ఏర్పాటు చేశారు. తాండూర్‌, పరిగి, నారాయణ పేట, కోయిలకొండ రూట్లో కూడా బస్సులు నడిచాయి. బస్సులకు సంబంధించి ఎలాంటి అదనపు చార్జీలు తీసుకోవద్దని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు ఇచ్చినా తాత్కాలిక కండక్టర్లు కొన్ని రూట్లలో అదనంగా వసూలు చేశారు. ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు కూడా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చాయి. ఉదయం ప్రయాణికుల తాకిడి అంతగా లేకున్నా మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. దసరా పండుగ దృష్టా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారికి అనుగుణంగా సర్వీసులు నడపలేకపోయారు. బస్టాండ్‌, డిపోల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో రీజియన్‌ పరిధిలో రోజుకు రూ.90 లక్షల నుంచి కోటి 10లక్షల వరకు ఆదాయం సమకూరేది. సమ్మె వల్ల ఆదాయం తగ్గుతోంది. రెండో రోజు రీజియన్‌లో దాదాపు 10 నుంచి 15 శాతం ఆదాయం మాత్రమే వస్తోంది. దసరా పండుగ దినాల్లో ఆర్టీసీకి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా సమ్మెఎమ్మార్పీఎస్‌ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసనలకు పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ముందుండి పోరాటం చేశారని, ఉద్యమ సమయంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బెక్కరి అనితతోపాటు ఇతర నేతలు, ప్రజాసంఘాల నాయకులుమద్దతు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెలో మహబూబ్‌నగర్‌ రీజియన్‌లోని తొమ్మిది డిపోలకు చెందిన 3,568 మంది కార్మికులు పాల్గొనడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పోలీస్‌శాఖ సహకారంతో రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నారు. సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇటు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు రోడ్డెక్కాయి. బస్సులకు సంబంధించి ఆయా రూట్లలో ఎలాంటి అదనపు చార్జీలు తీసుకోవద్దని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు ఇచ్చినా తాత్కాలిక కండక్టర్లు మాత్రం టికెట్‌ రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తుండడం విశేషం. కొంతమంది ప్రయాణికులు వారితో వాగ్వివాదం చేసినా అదనపు డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకుంటే దిగండి అంటూ దురుసుగా మాట్లాడారు. ప్రైవేట్‌ వాహనాల్లో ఇష్టానుసారంగా అదనపు డబ్బులు వసూలు చేశారు.హబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ప్రయాణికుల కోసం నడుస్తున్న బస్సుల వివరాల గురించి సంబంధిత ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండా ఎప్పటికప్పుడు డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు చేయాలని కోరారు.