కొనసాగుతున్న ముంబై రాజస్తాన్ రాయల్స్‌పై ఘనవిజయం – పాయింట్లలో ఫస్ట్‌ప్లేస్
ముంబై : వాంఖడే స్టేడియంలో రెండు హోరా హోరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ప్రధమ స్థానానికి ఎగబాకింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయ ల్స్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి 152 పరుగులుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ మొదట నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు ఔట్ అయ్యాక స్కోరు వేగం నెమ్మదించింది. బ్యాటింగ్‌లో మాక్స్‌వెల్ 23, ఓపెనర్ థారె 59, కార్తిక్ 21, శర్మ 14, పోలార్డ్ 17, హర్బజన్ సింగ్ 15, పరుగు లు చేశారు. రాజస్థాన్ బౌలింగ్‌లో ఫాల్కనర్, వాట్సన్ తలో 2 వికెట్లు తీశారు. తంబి, కూపర్ తలో వికెట్ తీశారు. 68 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది, రాజస్థాన్ ఓడిపోవడం ఖాయమను కున్నారు ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన బిన్ని , హూడ్జ్ అశలు రేకేత్తించారు కాని హూడ్జ్ 39పరుగుల వద్ద మలింగ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరి గాడు. బిన్నీ 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై విజ యం ఖరారయింది. ముంబై బౌలింగ్‌తో రాజస్తాన్‌ను కట్టడి చేసింది. ముం బై బౌలింగ్‌లో జాన్సన్, కులకర్ణి తలో రెండు వికెట్లు తీయగా, హర్బజ న్, మ లింగ, ఓజా తలో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా థారే నిలిచాడు.