-కొలను కాదు-తహసీల్దార్ కార్యాలయం.

-అధికారులకు కనిపించని కష్టాలు.
-స్పందించాలని పలువురు విజ్ఞప్తి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిది,ఆగష్టు8(జనంసాక్షి):
జిల్లా కేంద్రంలోని మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణం అంతా వర్షపు నీటితో నిండి కొలనును తలపిస్తుంది.ఇదే ప్రాంగణంలో జిల్లా ట్రెజరీ కార్యాలయం మరియు ఆధార్ కేంద్రం లు కూడా ఉన్నాయి.ఈ మూడు కార్యాలయాలకు ప్రతి రోజూ వందలాది మంది వివిధ పనుల కోసం వస్తుంటారు.గేటు నుండి లోపలికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు,పిల్లలు మల్లుకొని ఉన్న నీటిలో నడుచుకుంటూ లోపలికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.కార్యాలయం ముఖద్వారం వద్దనే వాన నీరంతా మల్లుకొని చెరువు ను తలపించేలా ఉండడం వల్ల కార్యాలయానికి వచ్చిపోయే వారికి ఇబ్బందులు ఎదురవుతుంది.ఈ నీటిలో దోమలు చేరుకొని వాటితో వివిధ రకాల వ్యాధులు ప్రభువే అవకాశం ఉంది.వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్న అధికారులే ఏమీ పట్టనట్టు గా ఉండడం ఆశ్చర్యం. మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ఉన్నా వారికి ఈ దృశ్యం కనిపించకపోవడం గమనార్హం.సోమవారం కురిసిన వర్షానికి తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణమంతా నీటితో నిండిపోయింది.ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ కార్యాలయా లకు ఇదే దుస్థితి నెలకొంటుంది.అదికారులు మాత్రం ఏమీ పట్టనట్టు గా కళ్ళు మూసుకుని తమ పనులు తాము చేసుకొని వెళ్తున్నారు. కావునా ఇప్పటికైనాసంబందిత అధికారులు స్పందించి ఈ ప్రాంగణంలో మట్టి వేసి నీరు నిలువ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని రాకపోకలకు ఆటంకం కలుగకుండా చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు.