*కోటంచ ఆలయ అభివృద్ధికి కృషి*
*భూపాలపల్లికి మెడికల్ కాలేజీ రావడం అభినందనీయం*
*ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి*
*నూతన ఆలయ చైర్మన్ అనిత ప్రమాణ స్వీకారం*
రేగొండ (జనం సాక్షి) : కోడవటంచ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతనంగా నియమింపబడ్డ చైర్మన్ మాదాడి అనిత కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నూతనంగా నియమితులైన ఆలయ చైర్మన్ మాదాడి అనిత కరుణాకర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కొడవటాన్చె లక్ష్మీనరసింహస్వామి మన ప్రాంత ఇలవేల్పు దైవమని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నానని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ కావడం అంటే మామూలు విషయం కాదని, భక్తిశ్రద్ధలతో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు వస్తాయని, అన్ని గ్రామాల్లో తిరుగుతూ కొత్త పెన్షన్లు అర్హులైన అందరికీ వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మారుమూల ప్రాంతమైన భూపాలపల్లికి 148 కోట్లతో మెడికల్ కాలేజీ ఇవ్వడం మన అదృష్టమని నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా గతంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి హాస్పటల్ నిర్మాణానికి 100 కోట్ల నిధులు మంజూరయ్యాయని. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేస్తున్నానని అన్నారు. మన ప్రాంతంలో ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, పంటలు కూడా బాగా పండుతాయి అని అన్నారు. పండిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్మేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎంపిటిసి రవీందర్ రావు, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ హింగే మహేందర్, జెడ్పిటిసి సాయిని విజయ, విద్యాసంస్థల చైర్మన్ నాయినేని సంపత్ రావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, టిఆర్ఎస్ నాయకులు పున్నం రవి, సామల పాపి రెడ్డి, కొలేపాక బిక్షపతి, కట్ల చిన్ని, మటిక సంతోష్, జనార్ధన్, అమ్ముల రాజయ్య, పట్టేం శంకర్, దాసరి నారాయణ రెడ్డి, కొడేపాక మొగిలి, డైరెక్టర్ లు పోగు సుమన్, తిరుపతి గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.