కోటగిరిలో నూతన బస్టాండు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన సి.పి.ఐ నేతలు
కోటగిరి ఆగస్ట్ 1 జనం సాక్షి:-మండల కేంద్రంలో నూతన బస్టాండు నిర్మాణం చేయాలని కోరుతూ సోమవారం రోజున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ…శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ,పాత బస్టాండ్ శిధిలావస్థలో ఉన్న పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
కోటగిరి కేంద్రంగా పోతంగల్,బోధన్,మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రయాణీకుల తాకిడి అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ శిధిలావస్థలో ఉన్నటువంటి పురాతన బస్టాండ్ ను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే శిధిలావస్థలో ఉన్నటువంటి పాత బస్టాండ్ తొలగించి నూతన బస్టాండ్ వెంటనే నిర్మించాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఏ విటల్ గౌడ్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రంజిత్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.