కోటి ఎకరాలను.. పచ్చగా చేయడమే లక్ష్యం


– రైతుల అప్పులు తీరి.. బాధలు తొలగాలి
– రైతుల ఖాతాల్లో ఐదారు లక్షలు ఉండేలా చేస్తా
– నాగమడుగు ద్వారా 40వేల ఎకరాలకు నీరిస్తాం
– జుక్కల్‌ నియోజకవర్గంలో ఆపద్ధర్మ సీఎం  కేసీఆర్‌
నిజామాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి) : తెలంగాణ రైతులంటే దేశానికే ఆదర్శంగా నిలవాలని, అమేరకు నావంతు ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చేందుకు కృషి చేస్తున్నాని, తద్వారా రైతులు అప్పులు తీరి బాధలు తొలగిచేలా చేస్తున్నానని అన్నారు.  నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీ ఆర్‌ ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో  కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం నాగమడుగు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని,  సాగునీటి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బిజ్జన్‌ వాడ వద్ద ఆనకట్ట నిర్మిస్తే అక్కడ కూడా 2వేల ఎకరాలకు నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కేసీఆర్‌ హావిూనిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఆగిపోవద్దని, మళ్లీ విూరు మరోసారి అధికారం ఇస్తే కోటి ఎకరాలను పచ్చగా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఓర్వలేకపోయారని,  ప్రతిపక్షాల ఆరోపణలు తప్పు అని రుజువు చేసేందుకే ఎన్నికలకు పోయామన్నారు. కాంగ్రెస్‌ పెండింగ్‌ పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, అభివృద్ధి పనులు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ కు మద్దుతు ఇవ్వాలని కేసీఆర్‌ కోరారు. రైతులు, కుల వృత్తుల వారందరూ బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతోందన్నారు. ఏడాదిన్నర లోపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తై అప్పుడు కోటి ఎకరాల్లో పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. కేసీఆర్‌ బతికున్నంత వరకు రైతుబీమా, రైతుబంధు పథకాలను కొనసాగిస్తానని, రైతుల అప్పుల తీరి.. బాధలు తొలగాలన్నారు. రైతుల ఖాతాల్లో ఐదారు లక్షలు ఉండేలా ఎదగాలని, ఆంధ్రా రైతుల కన్నా మేలైన రైతులు తెలంగాణలో ఉన్నారనే స్థాయికి రావాలన్నారు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. ముస్లింల
ఓట్లు తీసుకున్నారు తప్ప వారి అభివృద్ధి కోసం ఎవరూ పని చేయలేదున్నారు. కానీ ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని, ముస్లిం, బీసీ, ఎస్టీ, ఎస్సీల కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలు తీసుకువచ్చామన్నారు. పదేండ్ల తర్వాత ఈ పేద వర్గాల పిల్లలు విదేశాలకు వెళ్లి అద్భుతమైన పౌరులుగా తయారు అవుతామన్నారు.