కోడురులో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆటో ఒకరి మృతి

 

మహబూబ్‌నగర్‌: రోడ్డు ప్రక్కన నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మహబూబ్‌నగర్‌ మండలం పరిధిలోని కోడూరు గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటయ్య(55) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి