కోడేరు పంచాయతీ రాజ్ ఎఈ కృష్ణయ్య పుత్రిక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు.
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 02 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పంచాయతీరాజ్ ఏఈ కృష్ణయ్య పుత్రిక మొదటి పుట్టినరోజు వేడుకలు నారాయణపేట జిల్లా కోస్గి.గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా
కోడేరు మండల ఎంపీపీ కొండ రాధా సుధాకర్ రెడ్డి, పాల్గొనడం జరిగింది.
అలాగే కొండ్రావుపల్లి సర్పంచ్ వెంకట స్వామి. మాచిపల్లి సర్పంచ్ పూర్ణచంద్రారెడ్డి. తీగలపల్లి సర్పంచ్ .మైలారం సర్పంచ్ మశన్న .అదేవిధంగా వివిధ గ్రామాల కోడేరు మండలం లోని అయినట్టి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీడీవో అలాగే వివిధ గ్రామాల ముఖ్యులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా
చిన్నారిని నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించడం జరిగింది.