కోడేరు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం,

కోడేరు జనం సాక్షి ఆగస్టు 16 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో కొల్లాపూర్ శాసనసభ్యులు వీరమర్చి వర్ధన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు 85 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఒక లక్ష 116 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గం లోని పలు గ్రామాలలో కులాంతర వివాహం చేసుకున్న 9  మంది కొత్తజంటలకు 2 లక్షల 50 వేల చొప్పున 9 మందికి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కులాంతర వివాహాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వారికి ఈ చెక్కులు పంపించడం జరిగిందని వారిని ఆదుకునే విధంగా ఆర్థికంగా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో అయినా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు సాగునీరు తాగునీరు వంటి సంక్షేమ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేయలేదని ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజా సంక్షేమం మేలుకోరి ప్రజలకు ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే సువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కావాలంటే ఎమ్మెల్యే సంతకం ఉండాలని ఆ సంతకం నేను ఏ వర్గం ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి కల్యాణ లక్ష్మి చెక్కురు మంజూరయ్యే విధంగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కోడేరు మండల కేంద్రానికి చెందిన దూరేడి రఘువర్ధన్ రెడ్డి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్  కార్యదర్శి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోడేరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము దానయ్య వారి అనుచరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వదిలి ఎమ్మెల్యే బీర హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా కోడేరు మండల పరిధిలోని రేకులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఒప్పితాండ గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్ మాజీ ఉప సర్పంచ్ రాజు ల నాయక్ర్యం లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రావు సింగల్ విండో డైరెక్టర్ నాగులపల్లి జగన్మోహన్ రెడ్డి, తహసిల్దార్ బి మల్లికార్జున్ రావు, ఆర్ఐ జానయ్య, డిఫ్టి  తహాసిల్దార్ పురుషోత్తం ఎంపీడీవో ప్రభాకర్, ఎంపీ ఓ శ్రావణ్ కుమార్  వివిధ శాఖల అధికారులు, కోడేరు గ్రామ సర్పంచి వెంకటస్వామి బావ్వాయి పల్లి గ్రామ సర్పంచ్ కర్రెమ్మ, మాచుపల్లి గ్రామ సర్పంచ్ పూర్ణచంద్రారెడ్డి, రేకులపల్లి గ్రామ సర్పంచ్ లాల్ సింగ్, జనంపల్లి  గ్రామ సర్పంచ్ రాజాపూర్ గ్రామ సర్పంచ్ దేశ గౌని లీలావతి మధు గౌడ్,వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.