*కోదాడకు రైల్వే మార్గం తీసుకొచ్చిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం*

మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): మునగాల  మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదాడకు రైల్వే మార్గాన్ని తీసుకువచ్చిన నల్గొండ పార్లమెంటు సభ్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి శనివారం పాలభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొప్పుల జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, కోదాడ ప్రజల చిరకాల స్వప్నం రైల్వే మార్గమని, ఎన్నికల సమయంలో కోదాడకు రైలే మార్గాన్ని తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగనదని, ఇచ్చిన హామీ మేరకు డోర్నకల్ నుండి కోదాడ హుజూర్నగర్ మిర్యాలగూడెం వరకు 93 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని మంజూరు చేయటం జరిగిందని, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రైల్వే మార్గం తీసుకురావడం పట్ల ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య జిల్లా కార్యదర్శి కాసర్ల కోటేశ్వరరావు, మట్టయ్య, జానకి రెడ్డి, గంగుల హరిబాబు, జే శ్రీను, బద్రి, స్వామి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.