కోమటికుంట గ్రామంలో వైభవంగా ముగిసిన మొహరం వేడుకలు
జనం సాక్షి లింగాల ప్రతినిధి:
లింగాల మండలం కోమటికుంట గ్రామంలో హిందూ ముస్లింల సఖ్యతకు మతసామరస్యానికి చిహ్నంగా ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్న మొహరం వేడుకలు బుధవారం వైభవంగా ముగిశాయి గ్రామాలలో పీర్లలకు మొక్కుబడులు ఉన్నవారు బుధవారం పొట్టేళ్ల తో కందూరు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు వివిధ వేషధారణతో ప్రజలను బెల్లం పానకం తయారు చేసి ప్రజలకు పంచి పెట్టారు చివరి రోజు అందరూ కలిసి అలాయ్ ఆడారు బుధవారం సాయంత్రం పీర్ల కు బొంగులు చల్లుతూ “దట్టిలన్న మాయ లేదు పోతాడేమో కాసిమ” అంటూ పాటలు పాడుతూ మహిళలు బొడ్డెమ్మలు వేస్తూ యువకులు అలాయ్ఆడుతూ పీర్లకు ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు