కోయల్‌సాగర్‌ ప్రాజెక్టు నీరు విడుదల

మహబూబ్‌నగర్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ) : దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటిని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డి కలిసి విడుదల చేశారు. కోయిల్‌ సాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ నుంచి 90 క్యూసెక్కుల నీరు, రైట్‌ కెనాల్‌ నుంచి 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పంటలకు నీటిని విడుదల చేశామని ఎమ్మెల్యేలు తెలిపారు. కోయిల్‌సాగర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, స్థానిక ఎమ్మెల్యేలకు రైతులు కృతజ్ఞతలు చెప్పారు.

—————