కౌన్సిల్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 కోట్లతో అభివృద్ధి పనులు

ఆది బట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి)
కౌన్సిల్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 కోట్లు పలు అభివృద్ధి పనులకు కేటాయించి నట్లు  అదిబట్ల మున్సిపల్ చేర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో  మాట్లాడుతూ  మున్సిపల్ అభివృద్ధి దేంగా ముందుకు సాగుతున్నట్లు అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ లోని పెండింగ్ లో ఉన్న పనులకై  ఆర్ &బి అధికారులతో మాట్లాడానని   ఈ నెలలోపు పనులు మొదలు పెడతామని చెప్పడం జరిగింది.ప్రస్తుతం బొంగులూరు గేట్ మెయిన్ రోడ్డుకు ఒక కోటి 75 లక్షల రూపాయలు మరియు కొంగరకలాన్ లో జరిగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు పనులు మున్సిపల్ నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు
 మున్సిపల్  లోని కొందరు కౌన్సిలర్లకు  సూటి ఒక ప్రశ్న
మీరు ఏనాడైనా వార్డు సమస్యల గురించి,అయినా నా దృష్టికి గాని,కౌన్సిల్ మీటింగ్ లో గాని ప్రస్తావించారా  ఎవరో చెప్పిన దానికి తల ఊపడం గాని,చేతులు లేపడం గాని జరుగుతుంది.ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు పార్టీలకతీతంగా మీ వార్డు సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అందరం కలిసి పరిష్కరించుకుందామని అన్నారు. మున్సిపాలిటీలో గతంలో జరిగిన అవినీతిలో కొందరు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నదని ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు,చెరువులు,కుంటలు సీలింగ్ మరియు అసైన్డ్ భూములు కొందరు ప్రజాప్రతినిధులు కబ్జా చేసి ప్లాట్లు గా మార్చడం జరుగుతుందని. అట్టి అవినీతిపరులకు నేను అడ్డుగా ఉండడం వలన కౌన్సిల్ మీటింగ్ ను పావుగా వాడుకొని అడ్డుకోవడం జరుగుతుందని.టిఆర్ఎస్ మరియు ఏకైక కౌన్సిలర్ లకు సూటి ప్రశ్న మున్సిపాలిటీ అభివృద్ధి కొరకై మీరు మీ ప్రభుత్వాల నుండి ఏవైనా నిధులు తీసుకొచ్చారా గతంలోమున్సిపాలిటీలో జరిగిన అవినీతిలో గానీ ప్రస్తుతం ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారాల్లో గాని మీ పాత్ర ఉన్నదా లేదా లేకుంటే సిబిఐ ఎంక్వయిరీ కి సిద్ధమా తన వద్ద  అన్ని ఆధారాలు ఉన్నాయి.
మూడు సంవత్సరాలకు చైర్మన్ పై అవిశ్వాసం పెడితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి అని కొందరు కౌన్సిలర్లు ఆశపడ్డారు కానీ ప్రభుత్వము వారి ఆశలపై నీళ్లు చల్లడం మూలాన కౌన్సిల్ మీటింగ్ ను అడ్డుకుంటున్నారు.ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా నాలుగు సంవత్సరాలు నేనే చైర్మన్ గా ఉంటాను. పార్టీ లకు అతీతంగా అందరూ కలిసి వస్తే అవినీతిని అడ్డుకుంటూ ప్రభుత్వ భూములు కాపాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు

తాజావార్తలు