క్యాన్సర్ తో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం
కార్యకర్తల సంక్షేమమే పార్టీ ప్రధాన బాధ్యత : యువనేత బీపీ నాయక్
జనంసాక్షి, అక్టోబర్ 08
ఖమ్మం: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గిరిజన మోర్చా జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైరా అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు బీపీ నాయక్ పాల్గోన్నారు. గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవి రాథోడ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఖమ్మం మూడవ టౌన్ మోర్చా నాయకులు వాంకుడోత్ వెంకట్ సతీమణి క్యాన్సర్ తో బాధపడడం తెలిసి యువనేత బీపీ నాయక్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి రాథోడ్, బీపీ నాయక్ లు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం పార్టీ ప్రధాన బాధ్యత అని పార్టీ సహకారంతో వారి చికిత్స కోసం మరింత సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి మోహన్ రాథోడ్, మోర్చా నాయకులు జంప, యువ మోర్చా వైరా అసెంబ్లీ ఇంచార్జ్ దిద్దుకూరి కార్తీక్ మరియు తదితరులు పాల్గొన్నారు.