క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలి

క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):క్యాన్సర్ వ్యాధిని ప్రాధమిక  దశలోనే గుర్తించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ కంటి ఆసుపత్రి వద్ద లయన్స్ క్లబ్ సూర్యాపేట, చేతన ఫౌండేషన్, ఉప్పల నాగలింగయ్య మెమోరియల్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్  వైద్యులచే నిర్వహించిన కాన్సర్ వ్యాధి నిర్ధారణ శిభిరానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరిక్షల క్యాంప్ ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఆదుర్తి రమేష్ చంద్ర, లయన్స్ క్లబ్ సభ్యులకు, సహకారం అందించిన దాతలను అభినందించారు. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.కొత్తగా 15 మెడికల్ కాలేజీలు నెలకొల్పారని , జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులలో డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని, నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్  ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ముందుకు రావడం హర్షణీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో దాదాపుగా వెయ్యి మందికి కాన్సర్ నిర్దారణ పరిక్షలు నిర్వహిస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రమేష్ చంద్ర అన్నారు.ఈ వైద్య పరీక్షల శిభిర నిర్వహణకు  ఉప్పల నాగలింగం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ. ఒక లక్ష , 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ రూ.40 వేలు , శ్రీవెంకటలక్ష్మీ హీరో షోరూం ఎండీ రాచర్ల కమలాకర్ రూ.25 వేలు  ఆర్దిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు  సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు , లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తీగల మోహన్ రావు, డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం , డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,లయన్స్ ఐ హాస్పిటల్ అధ్యక్షులు ఉప్పల సంపత్ కుమార్,  బండారు రాజా, రాచర్ల కమలాకర్, ఉప్పల రాజేంద్ర ప్రసాద్, లయన్స్ క్లబ్ ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్, ఆర్సి చిలుముల శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ చైర్మన్ వాంకుడోతు వెంకన్న, బసవ తారకం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.