క్రికెట్‌ అభిమానుల వన్డే మాతరం జపం

అప్పుడే నాలుగేళ్లు నాలుగు రోజుల్లా గడచిపోయాయి. మధ్యలో ఎన్నో మ్యాచ్‌లు, వన్డేలు, టెస్ట్‌మ్యాచ్‌లు వచ్చాయి. ప్చ్‌ అంటూ నిట్టూర్పులు వినిపించాయి. అయినా ప్రపంచ కప్‌ మజానే వేరు. క్రికెట్‌ అభిమానులు తమను తాము  మరిచిపోయి… క్రికెట్‌ను తనివితీరా ఆస్వాదించే ప్రపంచకప్‌ సంబరాలు మళ్లీ వచ్చేశాయి. ఇక 49 రోజుల పాటు క్రికెట్‌తోనే మమేకం అయ్యే పిచ్చోళ్లకు పండగే పండగ. నాలుగేళ్ల కిందట భారత్‌ ఉపఖండ ఆతిథ్యంలో పతాక స్థాయి వినోదాన్ని పంచిన ప్రపంచకప్‌.. ఈసారి ఆస్టేల్రియా, న్యూజిలాండ్‌ సంయుక్త ఆతిథ్యంలో అలరించడానికి సిద్ధమైంది. ఆరువారాలపాటు కోట్లాది క్రికెట్‌ ప్రేమికుల్ని అలరించే మహా క్రీడోత్సవానికి ఈసారి ఆస్టేల్రియా, న్యూజిలాండ్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఇప్పటివరకు ఆరుసార్లు సెవిూఫైనల్‌ దశకు చేరినా ఎన్నడూ ప్రపంచ కప్‌ దక్కించుకోలేకపోయిన న్యూజిలాండ్‌, ఈసారి సొంత గడ్డపై సర్వశక్తులూ ఒడ్డటానికి సన్నద్ధమైంది.ఈ మహా సంగ్రామానికి శనివారం ప్రేమికుల దినోత్సవాన తెరలేచింది. వేదిక ఏదైనా ప్రపంచమంతా క్రికెట్‌ అంటే భారత్‌ పాక్‌ మ్యాచ్‌నే అభిమానులు ఎక్కువగా వీక్షిస్తారు. ఈ ఎండు దేశాల మధ్యక్రికెట్‌ అంటే ప్రపంచానికి అంతగా ఆసక్తి ఆదరణా ఉంది. శనివారం తెల్లవారు జామున న్యూజిలాండ్‌, శ్రీలంక మధ్య తొలివన్డే మొదలయ్యింది. న్యూజిలాండ్‌, శ్రీలంక జట్ల మధ్యతో పాటు  ఆస్టేల్రియా, ఇంగ్లాండ్‌ల నడుమ ప్రారంభ పోటీలతో పదో ప్రపంచ కప్‌ సమరం  ప్రేక్షక లోకాన్ని కట్టిపడేయనుంది. ఇక మలివన్డే భారత్‌,పాక్‌ లమధ్య జరుగనుంది. ఇదే అసలైన సమరంగా క్రికెట్‌ అభిమానులు భావిస్తారు. రెండు సార్లు వన్డే ప్రపంకప్‌ సాధించిన భారత్‌ ఇప్పుడు ధోనీ సారథ్యంలో మరోమారు అగ్నిపరీక్ష ఎదుర్కోబోతోంది. క్రితం సారీ ధోనీ సేన అద్భుతంగా ఆడి ప్రపంచచ కప్‌/-ను సాధించి చరిత్ర సృష్టించింది. నాలుగేళ్ల క్రితం ముంబయి, వాంఖడే మైదానంలో లంకతో ¬రా¬రీగా పోరాడి  వంచిన ధోనీ జట్టు- ఇండియాకు రెండో ప్రపంచకప్‌ సాధించిపెట్టింది. అంతకుముందు  ఇరవై ఎనిమిదేళ్ల క్రితం అంటే  1983లో చరిత్రాత్మక లార్డ్స్‌ మైదానంలో వెస్టిండీస్‌తో తలపడి  ‘కపిల్‌ డెవిల్స్‌’ సృష్టించిన పెను సంచలనం ఎన్నటికీ మరపురానిది. అదే మనకు తొలి వన్డే ప్రపంచ కప్‌. ఆనాటి ఆటగాళ్లంతా మేటి ప్రదర్శన చాటారు. ఆనాడే మొహిందర్‌ అమర్‌నాథ్‌,  సందీప్‌ పాటిల్‌, బిన్నీ, మదన్‌లాల్‌, శ్రీకాంత్‌ ప్రభృతులతో కూడిన కపిల్‌ జట్టు క్రీడాపండితుల అంచనాలకు అతీతంగా అద్భుతాలు చేసి కప్పును ఎగురేసుకుని వచ్చి భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించారు. ఆ తరవాత అనేక పర్యాయాలు సెవిూస్‌ వరకు వెళ్లినా ఆ కలను నెరవేర్చలేదు. ధోనీ జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్న తరవాత విజయం మరోమారురుచి చూపారు. అందుకే మరోమారు ప్రపంచం దృష్టి అంతా ఆదివారంనాడు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరగనున్న పోటీ కోసం ఎదురు చూస్తోంది. అంతేకాదు మార్చి 29నాటి ఫైనల్‌కి మించి- ఉపఖండంలోనే కాదు, క్రీడాలోకమంతటా అమితాసక్తి వ్యక్తమవుతోంది. రెండు బృందాలుగా మొత్తం పద్నాలుగు దేశాల జట్లు తలపడుతున్న పోటీల్లో తుది పోరు ఆస్టేల్రియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, భారత్‌లకే పరిమితం కావచ్చుని  అంచనాలు ఉన్నాయి.  ప్రపంచకప్‌ శనివారమే మొదయినా అభిమానులకు మాత్రం అసలు టోర్నీ మొదలయ్యేది అడిలైడ్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌తోనే. అరుదుగా జరిగే ఇలాంటి మ్యాచ్‌లను కెరీర్‌లో ఒక్కసారైనా ఆడాలని ఏ ఆటగాడైనా కోరుకుంటాడు. ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనగానే టీమ్‌ఇండియా  రికార్డే గుర్తుకొస్తుంది. ఐతే గత పరాజయాలు పాక్‌ యువ ఆటగాళ్లపై ప్రభావితం చేయవని అనుకుంటున్నా. ఒకరిద్దరు తప్ప మిగిలిన ఎవరూ ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌

ఆడలేదు. ఈ మ్యాచ్‌ రెండు జట్లకూ చాలా కీలకం. ద్వైపాక్షిక సిరీస్‌లు, ముక్కోణాలు.. ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టీ20 ప్రపంచకప్‌.. వంటివి మధ్యలో వచ్చిపోతున్నా  క్రికెట్లో ఎన్ని పోరాటాలున్నా.. వన్డే ప్రపంచకప్‌ వన్డే ప్రపంచకప్పుకున్నమజాయే వేరు.  అందుకే ప్రపంచవ్యాప్తంగా  కోట్లాదిమంది కళ్లు ప్రపంచకప్‌ విూదే ఉన్నాయి. వేలకోట్ల బిజినెస్‌ కూడా దీనిపైనే ఆధారపడి ఉంది.

ప్రపంచకప్‌కు అసలైన ఊపొచ్చేది ఆదివారమే. ఆ రోజు భారత్‌, పాకిస్థాన్‌ అవిూతువిూ తేల్చుకోబోతున్నాయి. బలాబలాల పరంగా చూస్తే ప్రస్తుత ప్రపంచ అత్యుత్తమ జట్టు అదే. ఒత్తిడికి లొంగే బలహీనతను విడిచిపెడితే ఆ జట్టుకే కప్పు సొంతం కావచ్చు. ఈ మూడు జట్లు సెవిూస్‌ చేరడం ఖాయమని విశ్లేషకుల అంచనా. టీమ్‌ఇండియా అవకాశాలు కొట్టి పారేయలేమని.. ఆ జట్టును తక్కువ అంచనా వేయొద్దని కొందరు మాజీలు హెచ్చరిస్తుంటే.. మలింగ లాంటి ప్రమాదకర పేసర్‌తో.. సంగక్కర, జయవర్దనె లాంటి దిగ్గజాలతో బరిలోకి దిగుతున్న శ్రీలంక ప్రపంచకప్‌లో అనూహ్యంగా చెలరేగిపోయి ప్రత్యర్థులకు షాకిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనేవిూ లేదన్నది కొందరి అభిప్రాయం. అనూహ్య ప్రదర్శనకు పెట్టింది పేరైన పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. బలమైన బౌలింగ్‌ దళంలో వస్తున్న ఇంగ్లాండ్‌కు కూడా ఎంతో కొంత అవకాశం లేకపోలేదు. ఈ ఏడు జట్లలో ఏ నాలుగైనా సెవిూస్‌కు చేరొచ్చని అంచనా. అయితే క్రీడల్లో ఎప్పుడు ఏమి జరుగుతందో ఎలాంటి అద్భుతాలు చోటుచేసుకుంటాయో చెప్పలేం. ఎవరు ఎప్పుడు రాణిస్తారో కూడా చెప్పలేం.ఈ యేడు జరిగే ప్రపంచకప్‌ పోటీల్లో ఎలాంటి అద్భుతాలుజరుగుతాయో చూడాలి.